prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:32 am Digital Edition : PRAJA VANI

కూకట్‌పల్లిలో అంగరంగ వైభవంగా బజరంగ్ వినాయక శోభాయాత్ర

కూకట్‌పల్లిలో అంగరంగ వైభవంగా బజరంగ్ వినాయక శోభాయాత్ర

భక్తిశ్రద్ధలతో గణనాథుడి సాగనంపు.. వీధులన్నీ గణపతి నామస్మరణతో మార్మోగింపు

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 27: (ప్రజావాణి)

కూకట్‌పల్లి విలేజ్‌లో బజరంగ్ వినాయక శోభాయాత్ర భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. బజరంగ్ వినాయకుడిని ప్రత్యేకంగా అలంకరించి, భక్తుల జయజయధ్వానాల మధ్య శోభాయాత్రను ప్రారంభించారు.
ఈ శోభాయాత్ర బీజేపీ కార్యాలయం నుంచి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మీదుగా తిరిగి బజరంగ్ హనుమాన్ ఆలయం వరకు కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి భక్తిపూర్వకంగా వీడ్కోలు పలికారు. గణపతి నామస్మరణతో కూకట్‌పల్లి వీధులు ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగాయి.