prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 8:22 pm Digital Edition : PRAJA VANI

కురవిలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం

కురవిలో భక్తిశ్రద్ధలతో వినాయక నిమజ్జనం
పంచాయతీ కార్యదర్శి రాజేష్ వేద ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఎస్సై సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో బందోబస్తు
సర్పంచ్ లక్ష్మీ రాజు నాయక్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ

కురవి: మండల కేంద్రంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు.
గ్రామపంచాయతీ కార్యదర్శి రాజేష్ వేద ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతంలో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లను బోలగాని సతీష్ గౌడ్ పర్యవేక్షించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ లక్ష్మీరాజు నాయక్ మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనాన్ని భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు గ్రామపంచాయతీ తరఫున అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
మండల కేంద్రంలో గణపతి నవరాత్రుల సందర్భంగా
పూజలందుకున్న వినాయకుడు విగ్రహాలను భక్తిశ్రద్ధలతో పురవీధుల్లో ఊరేగిస్తూ గణనాథుడు విగ్రహాలను పెద్ద చెరువులో నిమజ్జనం చేశారు.

శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో
కురవి మండల కేంద్రంలోని స్థానిక గ్రామ పంచాయితీ
సెంటర్లో గణేష్ నవరాత్రులు సందర్భంగా
శివ గణేష్ యూత్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు
మామిడాల స్రిజ,చైతన్య మామిడాల,పావనిమామిడాల,
కడగట్ల బిధు, శ్రీహననయ,మేకల సృజన,
ప్రవీణ్వర్షిత్,ఆశిష్,ప్రణయ్,టింకు,అనిల్,విష్ణు,
సాత్విక్,గౌతమ్,కౌశిక్,రేతివిక్,హరహ,లక్కీ,రిషి,
వీరమాణిక్య,లేఖ హరహ చిన్నారులు
గణనాథుని భక్తిశ్రద్ధలతో పూజించారు. పదవరోజు ఆటపాటలతో పురవీధుల్లో గణనాథుని ఊరేగించి కొరవి పెద్ద చెరువులో భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.