prajavaani.net
Newspaper Banner
Date of Publish : 16 September 2026, 6:06 pm Digital Edition : PRAJA VANI

కురవిలో అకునూరి మురళికి ఘన సన్మానం

కురవిలో అకునూరి మురళికి ఘన సన్మానం
దళిత నాయకులు
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి సెప్టెంబర్ 16 ప్రజావాణి:
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ (TPF) ఆధ్వర్యంలో చేపట్టిన “విద్యారంగ బస్ యాత్ర” బుధవారం కురవికి చేరుకుంది. తెలంగాణ విద్యా కమిషన్ మాజీ ఛైర్మన్ అకునూరి మురళి నేతృత్వంలో ఈ యాత్ర కొనసాగుతోంది.
సెప్టెంబర్ 15న హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రారంభమైన ఈ బస్ యాత్ర సెప్టెంబర్ 27 వరకు తెలంగాణలోని పూర్వ పది జిల్లాల్లో కొనసాగనుంది. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం యాత్ర ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి వెళ్తున్న అకునూరి మురళిని కురవిలో దళిత నాయకులు ఘనంగా సన్మానించారు. దళితరత్న, వార్డు సభ్యులు దైద భద్రయ్య, ఇరుగు వెంకన్న, బొల్లం ఉప్పలయ్య, ఇరుగు సత్యం, రమణ తదితరులు శాలువతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ విద్యను పరిరక్షించేందుకు చేపట్టిన విద్యారంగ బస్ యాత్రకు తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.