*కిష్టాపూర్ గురుకుల బాలికల పాఠశాలలో టీడీ టీకా శిబిరం

*కిష్టాపూర్ గురుకుల బాలికల పాఠశాలలో టీడీ టీకా శిబిరం పరిశీలన* *అర్హులైన విద్యార్థినులందరికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలి: డా.కె.ఆనంద్* మేడ్చల్, సెప్టెంబర్ 17: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా.కె.ఆనంద్ మేడ్చల్ మండలం కిష్టాపూర్ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న టీడీ టీకా శిబిరాన్ని సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా టీకా కార్యక్రమం నిర్వహణ తీరును, విద్యార్థినులకు అందుతున్న వైద్య సేవలను ఆయన సమీక్షించారు. టీకా శిబిరంలో విద్యార్థినుల హాజరు, టీకాకు అర్హులైన విద్యార్థినుల గుర్తింపు, టీకా లబ్ధిదారుల జాబితా, టీకా...