వీర్లపల్లిలో ఏకగ్రీవంగా కమిటీ ఎంపిక – హక్కుల సాధన, సంస్థ బలోపేతానికి అంకితభావంతో పనిచేయాలని పిలుపు
వీర్లపల్లి, సెప్టెంబర్ 7 ప్రజావాణి :
ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రామగుండం కార్పొరేషన్ పట్టణ కో-ఇన్‌చార్జి కాసిపేట సదానందం మాదిగ ఆధ్వర్యంలో 21వ డివిజన్ వీర్లపల్లిలో ఆదివారం ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా ఇన్‌చార్జి చెన్నూరి శ్రీనివాస్ మాదిగ, రామగుండం మండల ఇన్‌చార్జి అంబాల రాజేందర్ మాదిగ హాజరై కమిటీ ఎన్నికను నిర్వహించారు.
నూతన కమిటీ సభ్యులుగా చంద్రగిరి లింగయ్య, చంద్రగిరి తిరుపతి, కాసిపేట సంపత్, కాంపెల్లి ఓదెలు, చంద్రగిరి మల్లేష్, చంద్రగిరి నరసయ్య, చంద్రగిరి రాజేశం, చంద్రగిరి సాయిరాం, చంద్రగిరి మహేష్, అల్లి లింగయ్య, కాంపల్లి లింగయ్య, కాంపెల్లి రవి, కాసిపేట సతీష్, చంద్రగిరి సాయి భరత్, కాసిపేట అక్షిత్ కన్న, చంద్రగిరి కుమార్, చంద్రగిరి వినోద్‌లను నియమించారు.
ఈ సందర్భంగా కాసిపేట సదానందం మాదిగ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల సాధనతో పాటు ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ సంస్థను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు నూతన కమిటీ సభ్యులు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.