కాశీలో కాశీ యాత్రిక్ నివాస్ నిర్మాణానికి శ్రీకారం
కాశీలో కాశీ యాత్రిక్ నివాస్ నిర్మాణానికి శ్రీకారం కాపు, బలిజ, మున్నూరుకాపు, తెలగ, తూర్పుకాపు కుటుంబాలకు శాశ్వత వసతి లక్ష్యం కూకట్పల్లి , సెప్టెంబర్ 18: (ప్రజావాణి ) పవిత్ర కాశీ పుణ్యక్షేత్రంలో కాపు, బలిజ, మున్నూరుకాపు, తెలగ, తూర్పుకాపు కుటుంబ సభ్యులు, రాబోయే తరాలకు ఉపయోగపడేలా “శ్రీ కృష్ణదేవరాయ కాశీ యాత్రిక్ నివాస్, నిత్య అన్నదాన సత్రం” నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో, దాతలు మరియు సమాజ సభ్యుల సహకారంతో సత్రం నిర్మాణానికి స్థల అన్వేషణ కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు....