కాశీలో కాశీ యాత్రిక్ నివాస్ నిర్మాణానికి శ్రీకారం
కాపు, బలిజ, మున్నూరుకాపు, తెలగ, తూర్పుకాపు కుటుంబాలకు శాశ్వత వసతి లక్ష్యం
కూకట్పల్లి , సెప్టెంబర్ 18: (ప్రజావాణి )
పవిత్ర కాశీ పుణ్యక్షేత్రంలో కాపు, బలిజ, మున్నూరుకాపు, తెలగ, తూర్పుకాపు కుటుంబ సభ్యులు, రాబోయే తరాలకు ఉపయోగపడేలా “శ్రీ కృష్ణదేవరాయ కాశీ యాత్రిక్ నివాస్, నిత్య అన్నదాన సత్రం” నిర్మించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాశీ విశ్వేశ్వరుని ఆశీస్సులతో, దాతలు మరియు సమాజ సభ్యుల సహకారంతో సత్రం నిర్మాణానికి స్థల అన్వేషణ కొనసాగుతోందని నిర్వాహకులు తెలిపారు.
ఈ నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు, సభ్యుల సలహాలు, సూచనలు స్వీకరించేందుకు హైదరాబాద్ వనస్థలిపురం ఎన్‌జీవో కాలనీలోని కాపు సంఘ భవనంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. సత్రం నిర్మాణానికి దాతలు ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్వాహకులు కోరారు. దాతల పేర్లను భవనంలోని శిలాఫలకంపై శాశ్వతంగా లిఖించడంతో పాటు, సత్రంలో బస, భోజన సౌకర్యాలను వంశపారంపర్యంగా కొనసాగించేలా ఏర్పాట్లు చేయనున్నట్లు వెల్లడించారు.
సమావేశం: సెప్టెంబర్ 18, శుక్రవారం సాయంత్రం 5 గంటలకు
వేదిక: కాపు సంఘ భవనం, ఎన్‌జీవో కాలనీ, వనస్థలిపురం, హైదరాబాద్.
ఈ పవిత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సమావేశానికి హాజరై సహకరించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
సంప్రదించండి:
సుబ్బరాయన్ పాలంకి – 9441886784
ఇమ్మడిశెట్టి ప్రతాప్
అల్లం కిషన్ రావు