*కార్పొరేట్ ఎస్టేట్ జీఎం గోపాలరాజు కు ఘన స్వాగతం*
* *మన ప్రజావాణి* మందమర్రి:-
సింగరేణి కార్పొరేట్ ఎస్టేట్ జనరల్ మేనేజర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించి, గురువారం తొలిసారి ఏరియాకు విచ్చేసిన కార్పొరేట్ ఎస్టేట్ జిఎం జిఎస్ గోపాలరాజు కు ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ, ఏరియా ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో ఘనంగా సన్మానించి, మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా ఏరియా జిఎం ఎన్ రాధాకృష్ణ మాట్లాడుతూ, నూతనంగా ఎస్టేట్ జీఎంగా ప్రమోషన్ పొందిన జిఎస్ గోపాలరాజు మొదటిసారి ఏరియాకు విచ్చేయడం చాలా సంతోషకరమని తెలిపారు. వారికి పదోన్నతి లభించినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఏదైనా సంస్థ పురోగతి సాధించాలంటే అధికారుల, కార్మికుల సమష్టి కృషి చాలా అవసరమని తెలిపారు. క్రమశిక్షణ, నిబద్ధత, నిరంతర శ్రమతో పనిచేసినప్పుడే అనుకున్న లక్ష్యాలను సులభంగా సాధించవచ్చునన్నారు. ఉద్యోగ బాధ్యతల్లో ఎదురయ్యే సవాళ్లను సానుకూల దృక్పథంతో స్వీకరించి, ముందుకు సాగాలని సూచించారు. గోపాలరాజు తమ సుదీర్ఘ అనుభవంతో ఎస్టేట్ విభాగం పురోగతికి మరింత వృద్ధిని చేకూరుస్తారని ఆశిస్తున్నామని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏరియా ఎస్ఓటు జిఎం జిఎల్ ప్రసాద్, కేకే గ్రూప్ ఏజెంట్ ఖాదీర్, శాంతిఖని గ్రూప్ ఏజెంట్ సంతోష్ కుమార్, డిజిఎం పర్సనల్ సిహెచ్ అశోక్, ఏరియా ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.