*కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు*
*విశిష్ట సేవలందించిన వారికి ఘన సన్మానం*
నేలకొండపల్లి ప్రతినిధి, మన ప్రజావాణి సెప్టెంబర్ 24 గురువారం
కాకతీయ యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో విశిష్ట సేవలు అందించిన పూర్వ, ప్రస్తుత అధికారులను ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నుండి రాష్ట్ర అవార్డు పొందిన ప్రొఫెసర్ ఏ. వెంకటేశ్వర్లు కాకతీయ యూనివర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి మరియు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ రామచంద్రం శాలువాతో, జ్ఞాపికతో సత్కరించారు.అదేవిధంగా మాజీ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ సీహెచ్. జగదీశ్వరరావును ఆదిలాబాద్ మాజీ డీపీఓ సీహెచ్. వీరభద్రంను జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎన్. శ్రీనివాసరావుని సన్మానించారు.
అంతేకాకుండా ప్రోగ్రాం ఆఫీసర్లుగా సేవలందించిన కామర్స్ లెక్చరర్ ప్రొఫెసర్ పి.సర్వేశ్వరరావుని,వ్యక్తిత్వ వికాస నిపుణులు గడ్డమనుగు రామారావుని మరియు బనిగండ్లపాడు కళాశాల ఫిజిక్స్ అధ్యాపకులను కూడా ఘనంగా సన్మానించారు.
జాతీయ సేవా పథకం, కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో వారు చేసిన విశిష్ట సేవలకు గాను సర్టిఫికెట్ మరియు జ్ఞాపికతో సత్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ వెంకట నారాయణ, మాజీ కోఆర్డినేటర్లు, మాజీ డీపీఓలు, ప్రస్తుత ప్రోగ్రాం ఆఫీసర్లు పాల్గొన్నారు. సంగీత, నృత్య కార్యక్రమాలతో కాకతీయ యూనివర్సిటీ ఆడిటోరియం మార్మోగింది.