కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శివరాత్రి వెంకటేశం మృతికి డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత నివాళి
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
మునుగోడు నియోజకవర్గం, చండూరు మండలం కస్తాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శివరాత్రి వెంకటేశం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పార్టీకి తీరని లోటని నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత పేర్కొన్నారు.మంగళవారం నాడు కస్తాల గ్రామంలోని వెంకటేశం నివాసానికి చేరుకున్న పున్న కైలాష్ నేత, ఆయన పార్థివ దేహంపై పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో పార్టీ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వెంకటేశం చేసిన సేవలు ఎనలేనివని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో చండూరు మండల పార్టీ అధ్యక్షుడు మేకల సాగర్ రెడ్డితో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.