prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 7:41 pm Digital Edition : PRAJA VANI

కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు

*కాంగ్రెస్ ప్రభుత్వం పై వ్యతిరేకతతో బీఆర్ఎస్ లోకి భారీగా వలసలు*

*షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న ముద్దెంగూడకు చెందిన కాంగ్రెస్, బిజెపి నాయకులు*
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 ప్రజావాణి

షాబాద్:కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో బీఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసలు వస్తున్నట్లు షాబాద్ మాజీ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. బుధవారం షాబాద్ మండల కేంద్రంలోని ఆయన నివాసంలో ముద్దేంగూడ సర్పంచ్ పర్వేద నర్సింలు, మాజీ సర్పంచ్ సుదర్శన్ ఆధ్వర్యంలో అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీలకు చెందిన కూర గోవర్ధన్ మాజీ ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు బి యదగిరి ,ఎన్ రమేష్,కె రాఘవేందర్,ఎం రవి,బి రమేష్,ఎన్ శివ,పి రమేష్,బి నర్సిములు,కె విష్ణు,వి మల్లేష్, జితే శ్రావణ్ , డోలు చంటి పటేల్ గూడెం నరేష్ ‎తదితరులు అవినాష్ రెడ్డి సమక్షంలో గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులున్నారు.