కాంగ్రెస్ పార్టీకి వడ్లూరి పర్శరాములు రాజీనామా –గుర్తింపు, గౌరవం లభించకపోవడంతోనే నిర్ణయం

బెజ్జంకి, సెప్టెంబర్ 2(ప్రజావాణి) కాంగ్రెస్ పార్టీలో 2006 నుంచి కార్యకర్తగా పనిచేస్తూ, మండల ప్రధాన కార్యదర్శిగా పలు బాధ్యతలు నిర్వహించిన సీనియర్ నాయకుడు వడ్లూరి పర్శరాములు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు బెజ్జంకి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు లింగాల శ్రీనివాస్‌కు రాజీనామా లేఖ అందించామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశానని, ఎంపీటీసీ, సర్పంచ్‌గా పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ పార్టీని వీడకుండా కార్యకర్తగా కొనసాగానని తెలిపారు....