ఎండపల్లి మండలం గొడిశెలపేట గ్రామానికి చెందిన తంగెళ్లపల్లి చక్రపాణి ఇటీవల అనారోగ్యంతో మరణించగా, ఆయన కుటుంబానికి పదో తరగతి మిత్రులు అండగా నిలిచారు. ఎండపల్లి ZPHS పాఠశాలలో 1983-84 బ్యాచ్‌లో చదువుకున్న 21 మంది తోటి స్నేహితులు మానవతా దృక్పథంతో రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని సేకరించారు. ఆదివారం గ్రామానికి వెళ్లి చక్రపాణి చిత్రపటానికి నివాళులర్పించిన మిత్రబృందం, సేకరించిన డబ్బులను ఆయన భార్య, కుమార్తెలకు అందజేశారు.