కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బల్లా పల్లవి
అనంత పురం బ్యూరో సెప్టెంబర్ 03 మన ప్రజా వాణి
పవిత్ర గురువారం సందర్భంగా శ్రీవారి మెట్టు ఎక్కి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి దర్శించుకున్నారు. శ్రీవారి మెట్లు ఎక్కి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని ఆమె దేవుణ్ణి వేడుకున్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా కురవాలని రైతులు, ప్రజలు బాగా ఉండాలని కోరుకున్నారు. ఆమె వెంట అనంతపురం టిడిపి నియోజకవర్గ అధ్యక్షురాలు మాజీ కార్పొరేటర్ విజయశ్రీ రెడ్డి తదితరులు ఉన్నారు.
