కలసపాడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, ఎండిపోయిన పంటలకు ఎకరాకు ₹50,000 నష్టపరిహారం ఇవ్వాలి,ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

కలసపాడు(కడప జిల్లా): సెప్టెంబర్ 22 ప్రజావాణి  సకాలంలో వర్షాలు లేక, భూగర్భ జలాలు అడుగంటి బోరుబావుల్లో నీరు రాకపోవడంతో కడప జిల్లా కలసపాడు మండలంలో పంటలు పూర్తిగా ఎండిపోయి రైతాంగం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది. మండలంలోని ఈ. తమలపల్లె మరియు రామాపురం గ్రామాల్లో ఎండిపోయిన వరి, కంది పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం మరియు సిపిఎం నాయకులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు తమ కష్టాలను, ఆవేదనను నాయకుల ఎదుట వెళ్లగక్కారు.వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సగిలి...