కలసపాడు నూతన ఎస్సై హనుమంతును మర్యాదపూర్వకంగా సన్మానించిన మండల టీడీపీ నాయకులు
కలసపాడు సెప్టెంబర్ 24 ప్రజావాణి మండల నూతన సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై)గా బాధ్యతలు స్వీకరించిన హనుమంతును గురువారం మండల తెలుగుదేశం పార్టీ (టిడిపి) ముఖ్య నాయకులు, కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఎస్సై హనుమంతుకు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సన్మానించి, నూతన బాధ్యతలపై అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల టిడిపి యువ నాయకులు సి. ప్రహ్లాద రెడ్డి, సీనియర్ నాయకులు బి. కృష్ణారెడ్డి,టి.నరసయ్య తదితరులు ప్రత్యేకంగా మాట్లాడారు.మండలంలో శాంతిభద్రతల...