కలవాయిలో ఘనంగా గురుపూజోత్సవం: మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం

నెల్లూరు జిల్లా కలవాయి సెప్టెంబర్ 7 ప్రజావాణి  మండల కేంద్రంలో గురుపూజోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అభినందన సన్మాన సభను అత్యంత ఘనంగా నిర్వహించారు.విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన పలువురు ఉపాధ్యాయులను,విద్యాశాఖ సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి,అవార్డులను అందజేశారు.మండల విద్యాశాఖాధికారి పి.నవీన్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చల్లా రఘురామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, తమ చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు ప్రశంసా పత్రాలు,జ్ఞాపికలను అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అవార్డు గ్రహీతల...