prajavaani.net
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 9:23 pm Digital Edition : MADHUBABU ANDRAPRADESH

కలవాయిలో ఘనంగా గురుపూజోత్సవం: మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానం

నెల్లూరు జిల్లా కలవాయి సెప్టెంబర్ 7 ప్రజావాణి  మండల కేంద్రంలో గురుపూజోత్సవ వేడుకలను పురస్కరించుకుని మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అభినందన సన్మాన సభను అత్యంత ఘనంగా నిర్వహించారు.విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన పలువురు ఉపాధ్యాయులను,విద్యాశాఖ సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సత్కరించి,అవార్డులను అందజేశారు.మండల విద్యాశాఖాధికారి పి.నవీన్ కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ చల్లా రఘురామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై, తమ చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు ప్రశంసా పత్రాలు,జ్ఞాపికలను అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

అవార్డు గ్రహీతల వివరాలు:

ఈ ఏడాది మండల స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన కింది ప్రముఖులకు ఈ గౌరవం దక్కింది:

1. మలిశెట్టి శ్రీనివాసులు (ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు)

2. కసిరెడ్డి పెంచలమ్మ (ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు)

3. నందిమండలం రవి (ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు)

4. మూరంరెడ్డి విజయమ్మ (ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు)

5. K.V. నారాయణరెడ్డి (ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు)

6. వి. లక్ష్మీ కుమారి (ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు)

7. అమరా వెంకటకృష్ణయ్య (మండల స్థాయి ఉత్తమ CRMT)

8. G. బాలకృష్ణ (ఉత్తమ డేటా ఎంట్రీ ఆపరేటర్) సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర అమూల్యం: అతిథులు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ, సమాజ నిర్మాణంలో మరియు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని కొనియాడారు. నిరంతరం శ్రమిస్తూ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించుకోవడం మన బాధ్యతని పేర్కొన్నారు. అవార్డులు సాధించిన వారు మరింత బాధ్యతతో పనిచేసి, మండలాన్ని విద్యా రంగంలో ముందంజలో ఉంచాలని ఆకాంక్షించారు.ఈ అభినందన సభలో ఉపాధ్యాయ సంఘాల ప్రముఖ నాయకులు కే. శ్రీహరి, ప్రసన్న కుమార్, జీ.వీ.మురళీకృష్ణ,బి.మురళి, రమణారెడ్డితో పాటు మండలంలోని ఉపాధ్యాయులు, సిఆర్‌ఎమ్‌టిలు, విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని అవార్డు గ్రహీతలను అభినందించారు. కార్యక్రమం అంతా ఎంతో ఉత్సాహభరితమైన వాతావరణంలో ముగిసింది.