prajavaani.net
Newspaper Banner
Date of Publish : 25 September 2026, 7:22 am Digital Edition : UPPU RAMESH JAGITHYAL

కరెంట్ షాక్‌తో యువకుడి దుర్మరణం: కొత్తపేటలో విషాదం

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో విద్యుత్ షాక్‌తో కొప్పుల రాజశేఖర్ (23) అనే యువకుడు మృతి చెందాడు. బుధవారం రాత్రి వినాయక నిమజ్జనం సందర్భంగా స్పీకర్ బాక్సుల కరెంట్ కనెక్షన్ తీస్తుండగా ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. మృతుడి తల్లి నీల ఫిర్యాదు మేరకు వెల్గటూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై ఉదయ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి శవపంచనామా నిర్వహించారు.