కరువు వస్తే బీఆర్‌ఎస్‌లో సంతోషమా..?

కరువు వస్తే బీఆర్‌ఎస్‌లో సంతోషమా..? ఎల్‌నినోను రాజకీయ ఆయుధంగా మార్చి విషప్రచారం రైతు కన్నీటిలో ఓట్లు వెతకడం నీచ రాజకీయం: మంత్రి ఉత్తమ్‌ హుజూర్‌నగర్, సెప్టెంబర్ 24 (ప్రజావాణి): ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న వేళ రైతులకు భరోసా కల్పించాల్సిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ కరువు రావాలని, పంటలు ఎండిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యవహరిస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్‌ ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రకృతి కారణంగా ఏర్పడిన వర్షపాత లోటును కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యంగా...