*కమనీయం చిన్నారి అక్షయ నృత్యం*
*సినీ నటుడు సుమన్ అభినందనలు*
రంగారెడ్డి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 22 ప్రజావాణి
సాంప్రదాయ అలంకరణలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యం కన్నుల పండుగగా ఉందని సినీ నటుడు సుమన్ అన్నారు. సోమవారం చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో అభినందన సంస్కృత సాంఘిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఉత్సవాలలో భాగంగా ‘అభినందన అక్కినేని పురస్కారని ఎంపికై కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలను తిలకించి వారిని అభినందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఆధునిక సమాజంలోనూ మన సాంప్రదాయ కళలపై మక్కువ పెంచుకుంటూ చిన్నారులు కూచిపూడి నృత్యాన్ని అభ్యసించడం అభినందనీయమన్నారు.
షాద్‌నగర్ పట్టణానికి చెందిన నాట్య నివేదాలయం కూచిపూడి గురువు భార్గవి శిష్య బృందం ప్రదర్శించిన నృత్యాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విద్యార్థులు తేజశ్రీ, నందిత, శ్రీయుక్త, ప్రణవి, ఆద్యశ్రీ, కాత్యాయిని, ఆరాధ్యతో పాటు వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.