prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 8:23 am Digital Edition : PRAJA VANI

కన్ సాన్‌పల్లిలో రూ.46,800లకు 10 కిలోల లడ్డూ కైవసం చేసుకున్న బి ఆర్ ఎస్ యువ నాయకుడు ధీరజ్ రెడ్డి

కన్ సాన్‌పల్లిలో రూ.46,800లకు 10 కిలోల లడ్డూ కైవసం చేసుకున్న బి ఆర్ ఎస్ యువ నాయకుడు ధీరజ్ రెడ్డి

కన్సన్పల్లి సెప్టెంబర్ 23, మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

అందోల్ మండలం పరిధిలో ని “కన్ సాన్‌పల్లి గ్రామంలోని దుర్గాభవాని గణేష్ మండపం వద్ద నవరాత్రుల పూజలు ముగిసిన అనంతరం నిర్వహించిన 10 కిలోల లడ్డూ వేలంపాటలో బీఆర్‌ఎస్ యువ నాయకుడు ధీరజ్ రెడ్డి రూ.46,800లకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా దుర్గాభవాని యూత్ కమిటీ సభ్యులు ధీరజ్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి లడ్డూను అందజేశారు. ధీరజ్ రెడ్డి ఆయురారోగ్యాలతో నూరేళ్లు సుఖసంతోషాలతో జీవించాలని, పాడిపంటలతో గ్రామం సుభిక్షంగా విరాజిల్లాలని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆయనకు ఉండాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. గణేష్ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.”