కండ్లకోయ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ

కండ్లకోయ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ మేడ్చల్, నేడు న్యూస్: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కండ్లకోయలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సుమారు రూ.32 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులకు ఐ క్లీన్ సంస్థ సహకారం అందిస్తోంది. ఐ క్లీన్ సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంస్థ ముందుకు...