prajavaani.net
Newspaper Banner
Date of Publish : 21 September 2026, 3:18 pm Digital Edition : MAHESH MEDCHAL

కండ్లకోయ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ

కండ్లకోయ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ

మేడ్చల్, నేడు న్యూస్: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, కండ్లకోయలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. సుమారు రూ.32 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ నిర్మాణ పనులకు ఐ క్లీన్ సంస్థ సహకారం అందిస్తోంది. ఐ క్లీన్ సంస్థ డైరెక్టర్ శ్రీకాంత్ చేతుల మీదుగా భూమి పూజ నిర్వహించారు. పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలనే ఉద్దేశంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి సంస్థ ముందుకు రావడంపై పాఠశాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

కార్యక్రమంలో సంస్థ సభ్యుడు శ్రీరామ్, గుండ్లపోచంపల్లి మాజీ కౌన్సిలర్ అమరం మోహన్ రెడ్డి, స్థానిక మాజీ కౌన్సిలర్ క్రిష్ణ గౌడ్, మండల విద్యాధికారి వై. శంకరయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గోపాల్, పాఠశాల కమిటీ చైర్‌పర్సన్ కలమ్మ, కాంట్రాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న ఐ క్లీన్ సంస్థకు పాఠశాల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.