కండ్లకోయలో వినాయకుడి లడ్డూ రూ.1.25 లక్షలకు వేలం
లడ్డూ వేలంలో గెలుపొందిన సత్తారి రాజేందర్ ముదిరాజ్
25 ఏళ్లుగా చైతన్య యూత్ వినాయక ఉత్సవాల నిర్వహణ.. రాజేందర్‌కు ఘన సన్మానం
కండ్లకోయ, సెప్టెంబర్ 29: 299వ డివిజన్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కండ్లకోయ పట్టణంలో చైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డూ వేలంపాటలో సత్తారి రాజేందర్ ముదిరాజ్ రూ.1,25,000కు లడ్డూను దక్కించుకున్నారు.
నవరాత్రుల సందర్భంగా ఘనంగా పూజలందుకున్న వినాయకుడి మహాప్రసాదమైన లడ్డూను వేలంలో గెలుచుకోవడం మహాభాగ్యమని కమిటీ, ముదిరాజ్ సంఘం పెద్దలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజేందర్ కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
25 ఏళ్లుగా ఉత్సవాల నిర్వహణ
గత 25 సంవత్సరాలుగా చైతన్య యూత్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తున్న సత్తారి రాజేందర్ ముదిరాజ్‌ను కండ్లకోయ మాజీ సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు తలారి పెంటేష్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి
తనయుడు, మల్లారెడ్డి విద్యాసంస్థల చైర్మన్ సీహెచ్ మహేందర్ రెడ్డి, మాజీ గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మద్దుల శ్రీనివాస్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ హేమంత్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ నాయకుడు సాకారబోయిన మల్లేష్ ముదిరాజ్ తదితరులు హాజరయ్యారు.
అలాగే సత్తారి రామకృష్ణ, తలారి వెంకటేష్, తలారి బిక్షపతి, తలారి మురళి, కే. సత్యనారాయణ, పి. వీరాస్వామి, తలారి నాగులు, జెల్ల శ్రీనివాస్, కండ్లకోయ మత్స్యకార సంఘం అధ్యక్షుడు కే. శ్రీకాంత్ ముదిరాజ్, చైతన్య యూత్ కమిటీ సభ్యులు, పట్టణవాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు.