కండ్లకోయలో మేడ్చల్ జిల్లా కోర్టు కాంప్లెక్స్‌కు శంకుస్థాపన
భూమిపూజ నిర్వహించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మేడ్చల్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రజలకు న్యాయసేవలను మరింత చేరువ చేయడంతో పాటు న్యాయవాదులు, కక్షిదారులకు ఆధునిక సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో చేపట్టిన నూతన జిల్లా కోర్టు భవన సముదాయ నిర్మాణానికి ఆదివారం కండ్లకోయలో ఘనంగా శంకుస్థాపన జరిగింది. మండల పరిధిలోని కండ్లకోయ గ్రామంలో ఏర్పాటు చేయనున్న సమగ్ర జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ పనులకు న్యాయశాఖ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి...