*కంఠమహేశ్వర స్వామి ఆలయంలో 30వ సోమవారం అన్నదానం*
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సెప్టెంబర్ 28: (ప్రజావాణి): మంచాల మండలం ఆరుట్ల గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కంఠమహేశ్వరస్వామి దేవాలయంలో శివస్వాముల గురుస్వామి లొంగరి యాదగిరి ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో కొనసాగుతోంది. గౌడ సంఘం పెద్దలు, దాతల సహకారంతో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమంలో భాగంగా 30వ సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని చెన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన శివస్వాముల గురుస్వామి వినోద్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వినోద్ నాయక్, లొంగరి యాదగిరి, బొద్రమోని అంజయ్య, గౌడ సంఘం పెద్దలు, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహగౌడ్, శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్, కొత్తపల్లి మహేందర్ గౌడ్, వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్, మదర్ గుడ్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ నేరెళ్ల శంకర్ తదితరులు కలిసి కంఠమహేశ్వరస్వామికి, శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం అన్నదాన ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
భక్తి, సేవాభావంతో నిర్వహిస్తున్న ఈ అన్నదాన కార్యక్రమం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించడంతో పాటు సమాజంలో దాతృత్వం, సేవాభావాన్ని పెంపొందిస్తోందని పలువురు పేర్కొన్నారు. స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని భక్తులు ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో పాండాల రాములు గౌడ్, రావుల బుచ్చయ్య, మాడపాకుల శ్రీనివాస్, కొండూరి శేఖర్‌తో పాటు గౌడ సంఘం పెద్దలు, శివస్వాములు, భక్తులు పెద్ద సంఖ�