prajavaani.net
Newspaper Banner
Date of Publish : 24 September 2026, 9:51 pm Digital Edition : SUDHAKAR NALGONDA CHANDOOR

ఓపెన్‌ యూనివర్సిటీ ఎమ్.సి.ఎ. ఎంట్రన్స్ దరఖాస్తు చివరి తేది సెప్టెంబర్ 28

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా కేంద్రంలో డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి ఎమ్.సి.ఎ (మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ) ప్రవేశ పరీక్ష దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 28 చివరి తేది అని విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ (ఎల్ఎస్ఎస్బి) డా. వై. వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇంటర్మీడియేట్ లో గాని, డిగ్రీలో గాని మ్యాథ్స్ ను ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలన్నారు. డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. దరఖాస్తు చేయవలసిన విద్యార్థులు www.braouonline.in వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకొని ప్రింట్ తీసుకోవాలని సూచించారు.