prajavaani.net
Newspaper Banner
Date of Publish : 27 September 2026, 7:20 pm Digital Edition : PRAJA VANI

ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ (SIR) పై ఈసీ తీరుకు నిరసనగా సెప్టెంబర్ 28న (రేపు) భారీ ర్యాలీ – ధర్నా

*ప్రెస్ నోట్ – ఫైనల్*

*ఓట్ల చోరీ, ఎస్ఐఆర్ (SIR) పై ఈసీ తీరుకు నిరసనగా సెప్టెంబర్ 28న (రేపు) భారీ ర్యాలీ – ధర్నా*

*జనగామ జిల్లా కాంగ్రెస్ పిలుపు : నెహ్రూ పార్క్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 27(ప్రజావాణి):
ఓట్ల చోరీ వ్యవహారం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 28న జనగామలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ తెలిపారు.

ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టి కలెక్టర్ కు వినతిపత్రం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశాన్ని దేశ ప్రజల ముందుకు తీసుకొచ్చి ఓటర్ల జాబితాలో అవకతవకలపై పోరాడుతున్నారన్నారు.

*ప్రధాన డిమాండ్లు:*
– ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
– ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలి
– ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలి
– ఓటర్ల జాబితాలో చేర్పులు, తొలగింపుల వివరాలు బహిర్గతం చేయాలి
– ఫిర్యాదులను పరిశీలించి పరిష్కరించాలి

వైటీడీఏ సభ్యుడు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ మాట్లాడుతూ.. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను కాంగ్రెస్ ప్రజల తరపున ప్రశ్నిస్తోందని, ఓటు హక్కు పరిరక్షణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమం పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య, శాసన సభ్యులు కడియం శ్రీహరి, మామిడాల యశస్విని రెడ్డి, జనగామ నియోజకవర్గ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి ల నాయకత్వంలో, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.

పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.