ఓటు హక్కును కాపాడాలి
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలి-
సీపీఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్
బెజ్జంకి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి)
ఓటు హక్కును పరిరక్షించాలని, ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపుపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల సీపీఐ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ మాట్లాడుతూ సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని,సీమా ఖన్నాను అరెస్టు చేసి విచారించాలని డిమాండ్ చేశారు.అలాగే
ఓటర్ల జాబితా సవరణలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, అర్హులైన ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే నిరసనలు చేపడతామని తెలిపారు.
కార్యక్రమంలో సీపీఐ నాయకులు బోనగిరి శ్రావణ్, దొంతరవేణి మహేష్, రొడ్డ చరణ్ తదితరులు పాల్గొన్నారు.