prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 3:08 pm Digital Edition : MAHESH MEDCHAL

ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం.. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

ఎస్ఐఆర్ అక్రమాలపై మేడ్చల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన

ఓటర్ల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం.. ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

మేడ్చల్ ప్రజావాణి:- ఎస్ఐఆర్ ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ నేతృత్వంలో ఈ ఆందోళన చేపట్టారు.


మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.

*అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించొద్దు*

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ.. SIR ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందన్నారు.

ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం చేయాలని కోరారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

*భారీగా పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు*

ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, మల్కాజ్‌గిరి ఎన్నికల ఇన్‌చార్జి లక్ష్మీకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, హజ్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ముజీబ్ రుద్దీన్, గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, బాలు రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి సత్యనారాయణ, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీపీటీ రాజు, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే వివిధ డివిజన్ల అధ్యక్షులు చాప రాజు, మల్లేష్ గౌడ్, సురేందర్ ముదిరాజ్, శాంతి కోటేష్ గౌడ్, రామిడి సప్న విజయ్ రెడ్డి, భూమయ్య యాదవ్, ముప్పు రామారావు, బొక్క ప్రభాకర్ రెడ్డి, కర్రె రాజేష్, బంది శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి రవి, పోగుల దిలీప్ రెడ్డి, బొమ్మ కళ్యాణ్, డబుల్‌పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంకటేష్, అలియాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తుంకి రమేష్, మేడ్చల్ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మాజీ మున్సిపల్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మండల మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి పాలకుర్తి రాఘవేందర్ గౌడ్, మాజీ వైస్ చైర్మన్ చీర్ల రమేష్, మేడ్చల్ ఆటో యూనియన్ అధ్యక్షుడు రవి కాంగ్రెస్ పార్టీకి చెందిన వివిధ అనుబంధ విభాగాల నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, బీసీ సెల్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై నిరసనలో పాల్గొన్నారు.