ఓఆర్‌ఆర్ ఘన్‌పూర్ ఎగ్జిట్ వద్ద ఐషర్ లారీలో మంటలు….రూ.16 లక్షల ఆస్తి నష్టం.. డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం
ఘట్కేసర్, సెప్టెంబర్ 8: ఓఆర్‌ఆర్ ఘన్‌పూర్ ఎగ్జిట్ వద్ద ఐషర్ లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి సుమారు రూ.16 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వాహనం నుంచి బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసుల వివరాల ప్రకారం.. నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ మేనేజర్ కె.వి.ఎస్.వి. ప్రసాద్‌కుమార్ ఫిర్యాదు మేరకు, సెప్టెంబర్ 7న ఆటోనగర్ నుంచి నాచారం వైపు వివిధ రకాల సరుకులతో 10 టైర్ల ఐషర్ లారీ (ఏపీ16టీఎక్స్7157) బయలుదేరింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఘట్‌కేసర్ పరిధిలోని...