ఒగ్గుకథ కళారంగంలో ‘ప్రైడ్ ఆఫ్ భారత్’ అవార్డు అందుకున్న పోశాల చంద్రమౌళి గౌడ్
టేకుమట్ల/ప్రజావాణి:మూడు దశాబ్దాలుగా ఒగ్గుకథ కళను తన జీవితంలో భాగంగా మలుచుకుని, జానపద కళా వైభవాన్ని సజీవంగా నిలబెడుతూ వస్తున్న టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన ప్రముఖ జానపద కళాకారుడు పోశాల చంద్రమౌళి గౌడ్ ‘ప్రైడ్ ఆఫ్ భారత్ ఇంటర్నేషనల్ అవార్డు’ను అందుకున్నారు. ఒగ్గుకథ కళారంగానికి ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ సారస్వత పరిషత్ కళామందిరంలో జరిగిన కార్యక్రమంలో ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు.గత 30 సంవత్సరాలుగా ఒగ్గుకథ కళాకారుడిగా తనదైన ముద్ర...