prajavaani.net
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 8:20 am Digital Edition : PRAJA VANI

ఏడు రకాల సన్న వడ్ల కొనుగోలు చేసిన రైతుల వివరాలు నమోదు చేసుకోవాలి – ఎ.ఓ. పి మల్లేష్

  1. *ఏడు రకాల సన్న వడ్ల కొనుగోలు చేసిన రైతుల వివరాలు నమోదు చేసుకోవాలి – ఎ.ఓ. పి మల్లేష్*

 

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

 

చండూరు మండల వ్యవసాయ అధికారి పి. మల్లేష్ మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రకటించిన 7 రకాల సన్న వడ్ల (fine varieties) కొనుగోలు చేసిన రైతుల వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి గురువారం వరకు సమయం మాత్రమే ఉన్నది. ఈ రకాలను కొనుగోలు చేసిన రైతుల వివరాల నమోదు ప్రక్రియను 10.09.2026 నాటికి పూర్తి చేయాలని డీలర్లకు సూచించడం. గురువారం వరకు మొత్తం “438”రైతులు మండల వ్యాప్తంగా ప్రభుత్వం ప్రకటించిన ఏడు సన్నవరి రకాలను సంబంధిత షాప్ వద్ద బోనస్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఈ రోజు రేపు చేసుకోగలరు. సొంత విత్తనాలు, కృషి విజ్ఞాన కేంద్రాల వద్ద కొనుగోలు చేసినట్లయితే ఏఈఓ వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఈనెల 10వ తారీఖు లోపు మాత్రమే అవకాశం ఉన్నందున రైతులు తొందరగా చేసుకోవాలని మరొకసారి కోరడమైనది మరియు రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే వారికి 500/- బోనస్ రాదు అని మండల వ్యవసాయ అధికారి తెలియజేచేశారు.