ఎస్సై హామీతో దీక్ష విరమించిన నాగరాజు
ఎస్సై హామీతో దీక్ష విరమించిన నాగరాజు 30 గంటల ఆమరణ నిరాహార దీక్షకు తెర.. నెల రోజుల్లో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని హామీ. ఇల్లంతకుంట, ప్రజావాణి అనంతరం బిక్కవాగుపై అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ అక్కెం నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను మంగళవారం మధ్యాహ్నం ఎస్సై ఉపేంద్రచారి హామీతో విరమించారు. 30 గంటలపాటు కొనసాగిన దీక్ష అనంతరం ఎస్సై ఉపేంద్రచారి నాగరాజుకు జ్యూస్ ఇచ్చి దీక్షను విరమింపజేశారు. బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించడంతో పాటు...