prajavaani.net
Newspaper Banner
Date of Publish : 28 September 2026, 1:31 pm Digital Edition : MAHESH MEDCHAL

ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై మేడ్చల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన

ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై మేడ్చల్‌లో కాంగ్రెస్ భారీ నిరసన

వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

అర్హులైన ఓటర్ల హక్కులను పరిరక్షించాలి: తోటకూర వజ్రెష్ యాదవ్

మేడ్చల్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడ్చల్‌లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచనలతో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

మేడ్చల్ చెక్‌పోస్ట్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం నుంచి మేడ్చల్ అంబేద్కర్ విగ్రహం వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హులైన ఓటర్లకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఓటర్ల హక్కులను పరిరక్షించాలి

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ప్రతి అర్హుడైన పౌరుడి ఓటు హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజల్లో ఉన్న అనుమానాలు, అభ్యంతరాలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అర్హులైన ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల హక్కుల పరిరక్షణ, ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత కోసం కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు హక్కును కాపాడేందుకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల భారీ హాజరు

ఈ నిరసన కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర నాయకుడు నక్క ప్రభాకర్ గౌడ్, మల్కాజ్‌గిరి ఎన్నికల ఇన్‌చార్జి లక్ష్మీకాంత్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మైపాల్ రెడ్డి, హజ్ కమిటీ సభ్యుడు మహమ్మద్ ముజీబ్ రుద్దీన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరసింహులు యాదవ్, డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, సత్యనారాయణ, బాలు రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి బీపీటీ రాజు, ఏ బ్లాక్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.

అలాగే కిష్టాపూర్–గుండ్లపోచంపల్లి–మేడ్చల్, జవహర్‌నగర్, కీసర, నాగారం, ఘట్‌కేసర్, పోచారం, ఎదులాబాద్, పీర్జాదిగూడ, మేడిపల్లి, చెంగిచెర్ల డివిజన్ల అధ్యక్షులు చాప రాజు, మల్లేష్ గౌడ్, సురేందర్ ముదిరాజ్, శాంతి కోటేష్ గౌడ్, రామిడి సప్న విజయ్ రెడ్డి, భూమయ్య యాదవ్, ముప్పు రామారావు, బొక్క ప్రభాకర్ రెడ్డి, కర్రె రాజేష్, బండి శ్రీరాములు గౌడ్, తుంగతుర్తి రవి, పోగుల దిలీప్ రెడ్డి, బొమ్మ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

డబుల్‌పూర్ మున్సిపాలిటీ అధ్యక్షుడు విఘ్నేశ్వర్ రెడ్డి, మూడు చింతలపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంకటేష్, అలియాబాద్ మున్సిపాలిటీ అధ్యక్షుడు తుంకి రమేష్, మేడ్చల్ మాజీ మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, గుండ్లపోచంపల్లి మాజీ మున్సిపల్ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్, మేడ్చల్ మండల మాజీ అధ్యక్షుడు రమణారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, బీసీ సెల్ నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.