prajavaani.net
Newspaper Banner
Date of Publish : 02 September 2026, 9:07 am Digital Edition : PRAJA VANI

ఎల్.నినో విపత్తు సమయంలో త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత

ఎల్.నినో విపత్తు సమయంలో త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత..

-కేంద్ర ప్రభుత్వం నిర్దేశాల మేరకు జూలై 31, 2027 వరకు సరిపడా త్రాగునీటిని నిల్వ చేసుకోవాలి.

–  సాగుకు నీరు ఇవ్వడంపై చాలా కసరత్తు చేసాం.. రెండు నెలల కిందటే ఆరుతడి పంటలు వేయండని చెప్పాం..

–  విపత్కర పరిస్థితుల నేపథ్యంలో రైతులు వరి, మిర్చి వేయొద్దని సూచన.. క్లిష్ట పరిస్థితుల్లో అందరూ సహకరించాలి..

– నవంబర్ 10 వరకు టీబీ డ్యాం నీరు వచ్చేలా అధికారులు ప్లాన్ చేయండి..

– రాబోయే 80 రోజుల నీటి వినియోగ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలి..

తుంగభద్ర డ్యాంకి ఉన్న 33 గేట్లు ఒకేసారి మార్చాం.. అది అల్ ఇండియా రికార్డు.

– సాగునీటి సలహా మండలి సమావేశంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు  శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..

అనంతపురం బ్యూరో సెప్టెంబర్ 01మన ప్రజా వాణి
:ఎల్.నినో విపత్తు సమయంలో త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కే పేర్కొన్నారు.
అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో మంగళవారం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో సాగునీటి సలహా మండలి (ఐఏబి) సమావేశం నిర్వహించగా.. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ, జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, అసిస్టెంట్ కలెక్టర్ సుయాశ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ 30 సంవత్సరాల అనుభవంలో ఇంత విపత్తు చూడలేదన్నారు. 1994 నవంబర్‌లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత, అదే సంవత్సరం డిసెంబర్‌లో తాగునీటి ఎద్దడి ప్రారంభమైందని, ప్రారంభంలో హెచ్ఎల్సి ప్రాజెక్ట్‌పై పూర్తి అవగాహన లేకపోయినా, తుంగభద్ర డ్యామ్ వరకు ఉన్న ఇంజనీర్లతో మాట్లాడి స్వయంగా నోట్స్ తయారు చేసుకుంటూ ప్రాజెక్ట్‌పై అవగాహన పెంచుకున్నామన్నారు. రైతుల జీవితాలను, వారి కష్టాలను ప్రత్యక్షంగా చూశానని, హెచ్ఎల్సి జిబిసి ఆయకట్టు పరిధిలోని రైతులు ఎకరానికి ₹40,000 నుండి ₹45,000 వరకు కౌలు, ఎరువులకు పెట్టుబడి పెడుతూ ప్రకృతితో పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. సాగుకు నీరు ఇవ్వడంపై చాలా కసరత్తు చేశామని, రెండు నెలల కిందటే ఆరుతడి పంటలు వేయండి అని చెప్పామని, ముందే రైతులను ప్రభుత్వం నుంచి అప్రమత్తం చేశామన్నారు. ఎల్.నినో నేపథ్యంలో నీటి కొరత మరియు వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులకు ముందుగానే హెచ్చరికలు చేశామని, జూలై, ఆగస్టు నెలల్లో చాటింపు వేయించి ఆరుతడి పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకున్నామన్నారు. టిబి డ్యామ్ గేట్లు డ్యామేజ్ అయిన సమయంలో ఎంతగానో బాధ పడ్డానని, చరిత్రలో నిలిచిపోయేలా ఒకే సీజన్లో అన్ని గేట్లు ఒకేసారి మార్చడం జరిగిందని, తుంగభద్ర డ్యాంకి ఉన్న 33 గేట్లు మారిస్తే అది అల్ ఇండియా రికార్డు అయిందని, రెండేళ్ల కిందట గేటు కొట్టుకుపోతే వెంటనే వేశామన్నారు. గేట్ల మార్పుకి ఇరిగేషన్ శాఖ మంత్రి ఎంతగానో సహకరించారన్నారు.*
హెచ్.ఎల్.సిలో ఎనిమిది బ్రిడ్జిలు కూలిపోయి నీటి ప్రవాహానికి అడ్డుగా ఉంటే గత ఐదు సంవత్సరాలలో పట్టించుకోలేదని, అలాగే వదిలేస్తే.. 30–35 కోట్ల రూపాయలు వెచ్చించి వంతెనలను నిర్మించామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశాల మేరకు జూలై 31, 2027 వరకు సరిపడా త్రాగునీటిని నిల్వ చేసుకోవాలని తెలిపారని, త్రాగునీటి అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో గోదావరి నీళ్లు వచ్చే చోట మినహా మిగిలిన ప్రాంతాల్లో వరి, మిర్చి వంటి ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను వేయవద్దని, రైతులు ఆరుతడి పంటలనే ఎంచుకోవాలని సూచించారు. కృష్ణ యాజమాన్య బోర్డు సమావేశం జరగాల్సింది వాయిదా పడిందని, అయినా కూడా ఏ విధంగా రైతులకు నీళ్లు ఇవ్వాలనే అంశంపై ప్రయత్నం చేస్తున్నామన్నారు. ముందుగా జిల్లాలో త్రాగునీరు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని, త్రాగునీటికి నీళ్లు ఇచ్చాకే చెరువులకు ఇవ్వాలి అన్న విషయం ఆలోచిస్తామన్నారు. ఈ విపత్కర ఎల్.నినో నేపథ్యంలో రైతులు వరి, మిర్చి వేయొద్దని సూచన అందరికి చేరాల్సిన అవసరం ఉందని, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అందరూ సహకరించాలన్నారు. నవంబర్ 10 వరకు టీబీ డ్యాం నీరు వచ్చేలా అధికారులు ప్లాన్ చేయాలని, తుంగభద్ర డ్యామ్ మూసివేసేలోపు.. 10వ తేదీ నవంబర్ లోపు వచ్చే నీటిని వీలైనంత ఎక్కువగా మనం వాడుకునేలా ఉండాలని, 80 రోజుల ప్రణాళికను ఇరిగేషన్ శాఖ వారు తయారు చేయాలన్నారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుండి నవంబర్ 10వ తేదీ వరకు నీటి విడుదలకు ప్రణాళిక ఉండగా.. అవసరమైతే కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి మరో 10–15 రోజులు పొడిగించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసి, అందుబాటులో ఉన్న ప్రతి నీటి బొట్టును ఆయకట్టు మరియు తాగునీటి అవసరాలకే వినియోగించాలని నిర్ణయించారన్నారు. రాబోయే 80 రోజుల నీటి వినియోగ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు మిర్చి, వరి వేయరాదన్నారు.హెచ్ ఎన్ ఎన్ ఎస్ నీటిపై 4వ తేదీ అనంతరం మరోసారి చర్చించి స్పష్టత ఇద్దామన్నారు. పీఏబీఆర్ లో నీటి నిల్వలు తగ్గకుండా చూడాలని, వరి, మిర్చి పంటలకు నీరు ఈసారి ఇచ్చే అవకాశం లేదు..ఆరుతడి పంటలకు మాత్రమే నీరు అందించడం జరుగుతుందన్నారు. రైతులతో అనవసరంగా ఖర్చుపెట్టించే పనులు చేయొద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. వచ్చిన నీటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో సలహాలు ఇవ్వాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం అని, రైతులకు సక్రమంగా అవగాహన కల్పిస్తూ వారు అనవసరంగా పెట్టుబడి పెట్టీ నష్టపోకుండా కృషి చేస్తున్నామన్నారు. పంట వేసిన ప్రతి రైతును కాపాడడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యాన పంటలు ఏ విధంగా కాపాడాలో అధికారులు చర్యలు చేపట్టండి..రైతులకు అవగాహన కల్పించాలి..పరిస్థితిని రైతులకు వివరించాలన్నారు. రైతులపై ఎలాంటి బలవంతపు చర్యలు లేకుండా, కేవలం అవగాహన నచ్చజెప్పే విధానాలనే ఉపయోగించాలన్నారు. ఈ రోజు నుంచే ఆరుతడి పంటలకు , హెచ్ ఎల్ ఏం సీ
జీ బి సి కింద నీరు విడుదల చేస్తున్నాం అని అన్నారు. వెలిగొండ రిజర్వాయర్ ఒక చరిత్ర అని, మార్కాపురంలో కూడా నీటి సమస్య ఎక్కువగా ఉందని, వెలుగొండ ప్రారంభం చారిత్రాత్మకం అని, ఉమ్మడి ప్రకాశం జిల్లా కష్టాలు తీర్చేందుకు సీఎం ప్రత్యేక దృష్టి సారించారన్నారు.*
ఆరుతడి పంటలకు నీరు ఇచ్చేందుకు (గుంతకల్లు ఉపకాలవ)ల విడుదలను ఈరోజు రాత్రి నుంప్రారంభించాలన్నారు. తాగునీటి అవసరాల అంచనా వేసి, ప్రాధాన్యత ఆధారంగా నీటిని నిల్వ చేయడమరియు పంపిణీ చేయడంపై చర్చించారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితిని వివరించడానికి, ప్రతి వారం ప్రెస్ మీట్లు పెట్టడం మరిమీడియా సహాయం తీసుకోవడం చేయాలన్నారు. అధికారులందరూ ఇది ఒక క్లిష్టమైన సమయంగా భావించి పూర్తి స్థాయిలో బాధ్యతగా నీటి నిర్వహణ చేయాలని సూచించారు.*విజయవాడలవివిధ శాఖల పనులను ఫాలో అప్ చేయడానికి ఒక లైజన్ ఆఫీసర్‌ను నియమించాలని, ఏవైనా పెండింగ్ పనులు ఉంటే ఆ ఆఫీసర్‌కు తెలియజేయాలని జిల్లా అధికారులకు సూచించారు. పిఏబిఆర్ గేట్ డిజైనఆమోదం కోసం సీఈ, సీడబ్ల్యూసీ అధికారులను స్వయంగా కలిసి త్వరగా పూర్తి చేయించాలని ఆదేశించారు. పిఏబిఆర్ లో బ్యాలెన్స్ 5 టి ఎం సి ల నీటి నిల్వకు సంబంధించి పెండింగ్‌లో ఉన్భూసేకరణ ప్రక్రియను కలెక్టర్, సీఈలతో సమన్వయం చేసుకుని త్వరగా పూర్తి చేయాలన్నారు. డ్యామ్ భద్రత మరి నీటి నిల్వ పనులు ముందుకు తీసుకెళ్లాలన్నారు. హెచ్.ఎల్.సి ఎస్ఈ పదవీ వ లోపే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నారు.
ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ ఎల్.నినో ప్రభావం వల్ల ప్రపంచంలోని సగానికి పైగా దేశాల్లో తీవ్రమైన పరిస్థితులు నెలకొన్నాయని, భారతదేశంలో మొత12 రాష్ట్రాలలో ఎల్.నినో ప్రభావం చాలా అధికంగా ఉందని, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయన్నారు.  కర్ణాటకలోని తుంగభద్ర రిజర్వాయర్ కింఉన్న 12 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వం మొదట ప్రకటించిందన్నారు. తదనంతరం ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు ఐసిసి మీటింగ్‌లో ఆగస్టు 11న సవరించిన నిర్ణయం తీసుకున్నారని, రాబోయే ప్రవాహాలఅంచనా వేస్తూ 80 రోజుల పాటు నవంబర్ 10వ తేదీ వరకు కాలువలకు అధికారికంగా నీరు విడుదల చేయాలని కర్ణాటక నిర్ణయించిందన్నారు. ఈ ఏడాది తుంగభద్ర రిజర్వాయర్‌లో దాదాపు 105 టిఎంసిల నీటి లభ్యఉంటుందని అధికారుల అంచనా అని, అందులో హెచ్‌ఎల్‌సి కింద మన రాష్ట్ర వాటా 16 టిఎంసిలు కాగా, ఇప్పటివరకు దాదాపు 2 టిఎంసిల వరకు నీటిని ఉపయోగించడం జరిగిందని, ఇంకా 14 టిఎంసిల నీటి వాటా ఉందన్నారు. గతంలో 32.5 టిఎంసిల నీటి కేటాయింపులు ఉన్నప్పుడు, వర్షాల వల్ల అదనంగా 6 నుండి 8 టిఎంసిలు వచ్చేవని, కానీ ఇప్పుడు త్రాగునీటి అవసరాలు పెరిగాయి, వ్యవస్థలు కూడా పెరిగాయని తెలిపారు. ఒకవైపు రైతులకు నీరు అందించాలనే ఆశ ఉన్నప్పటికీ, పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు లేక నష్టం జరుగుతుందనే ఆందోళన ఉందని, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిర్వహణ నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అధికారులు ఎటువంటి మితిమీరిన అంచనాలకు పోకుండా, అలాగని వాస్తవాలను దాచకుండా నిజాన్ని రైతులకు స్పష్టంగా వివరించాలన్నారు. వరి, మిర్చి వంటి వరి పంటలు (తడి పంటలు) వేసుకుని నీళ్లు చాలక నష్టపోకుండా, అందుబాటులో ఉన్న నీటి లభ్యత ఆధారంగా రైతులు నిర్ణయం తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. రైతుల నమ్మకాన్ని నిలబెట్టాలని, బీడున్న 35 వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తే పశుగ్రాసం వచ్చేందుకు అవకాశం ఉంటుందని అందుకు ప్రణాళికలు అందించాలన్నారు. హెచ్.ఎల్.సి కాలువ కింద 80 రోజులకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని, రైతులను పశువులను ఆదుకోవాలన్నారు.ఈ సందర్భంగా ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎల్.నినో ప్రభావం ఎక్కువగా ఉంటుందని, విపత్కర పరిస్థితులు ఎదుర్కొనేందుకు రైతులతో సమావేశాలు పెట్టాలని, వారికి అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ శాఖ మరియు ఇరిగేషన్ శాఖ ప్రతి గ్రామంలో వెళ్లి ఎల్.నినో పరిస్థితులు వివరించాలన్నారు. పశువులను కాపాడుకోవాలని, పశుగ్రాసం పెంచుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, పశుగ్రాసాన్ని అందించేందుకు ప్రతిపాదనలు పెట్టాలని తెలియజేశారు. ప్రజలందరికీ కూడా త్రాగునీటిని అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పండ్లతోటలను కూడా రక్షించుకోవాలన్నారు.ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ హంద్రీ-నీవా కాల్వ ద్వారా గొల్లపల్లి రిజర్వాయర్ నిండిన తర్వాత, రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని దాదాపు 44 చెరువులకు నీరు ఇవ్వాలని కోరారు.భూగర్భ జలాలు దారుణంగా పడిపోవడం వల్ల 1000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరు పడటం లేదని, చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి, రైతులకు తోడ్పాటుతో పాటు తాగునీరు, పశువుల దాహార్తి తీరుతుందన్నారు.పేరూరు ప్రాజెక్ట్ కింద ఉరవకొండ, ధర్మవరం, రాప్తాడు పరిధిలోని 49 చెరువులకు కూడా నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పర్ పెన్నార్ ప్రాజెక్ట్ కోసం 804 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, రైతులు నమ్మకంతో ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చారని, పనులు కూడా ప్రారంభమయ్యాయని, అయితే ఇంతవరకు రైతులకు పరిహారం అందలేదని, ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని కోరారు. అనంతపురం గ్రామీణ ప్రాంతంలో పెద్ద మండలానికి సంబంధించి ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోందని, తెలిపారు.ఈ సందర్భంగా తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి మాట్లాడుతూ సౌత్ కేనాల్ నుండి టిబిసికి నీటిని ఏమైనా కేటాయించారా అంటూ అడిగారు. చెరువులకు ఇతర అవసరాలకు కేటాయింపులు ప్రణాళికబద్ధంగా జరగాలని సూచించారు. గతంలో భారీగా నీటిని ఇచ్చామని గుర్తుచేశారు. ముచ్చుకోట రిజర్వాయర్, మిగిలిన 16 ట్యాంకులు, చెరువులను కనీసం భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే స్థాయి వరకు నీటితో నింపాలని కోరారు. భూగర్భ జలాలు రీఛార్జ్ అయ్యే ప్రాంతాల్లో నీటిని అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తాగునీటి కోసం కేటాయించిన నీటిని పక్కదారి పట్టించకుండా, మళ్లించకుండా చూడాలన్నారు. నియోజకవర్గ పరిధిలో పుట్లూరు, ఎల్లనూరు, తదితర ప్రాంతాల్లో ఉద్యాన పంటలు ఉన్నాయని, వాటిని ఎలా కాపాడాలి అనేది చూడాలని కోరారు.ఈ సందర్భంగా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఎల్.నినో ప్రభావం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి మరింత సవాలుగా మారే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామీణ ప్రాంతాలు తాగునీటి కోసం చెరువులపైనే ఆధారపడుతున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు నీటిని ఎలా కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత అవసరం అన్నారు. రైతుల్లో ఉన్న ఆందోళనలను తగ్గించాలని, ఇప్పటికే ఉన్న పంటలను ఎలా కాపాడుకోవాలో సూచించాలన్నారు. ప్రస్తుత పరిస్థితులపై గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం చేసి రైతులలో అవగాహన పెంచాలన్నారు. శింగనమల నియోజకవర్గంలోని 6 మండలాల్లో చీని, అరటి పంటల సాగు ఎక్కువగా ఉందని, తీవ్ర నీటి కొరత వల్ల గార్లదిన్నె, కోటంక, మట్టూరు, కల్లూరు, ఎర్రగుంట్ల తదితర గ్రామాల్లో చీని తోటలు ఎండిపోయే పరిస్థితి ఉందన్నారు. వాటిని కాపాడుకోవడానికి ప్రభుత్వ పరంగా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరాను మరింత పెంచి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ సందర్భంగా అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ అర్బన్ నియోజకవర్గంలో రానున్న వేసవిలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో తాగునీటి అవసరం రోజు రోజుకీ పెరుగుతోందన్నారు. అందుకు తగిన విధంగా ఈ ఏడాది నీటిని కేటాయించాలన్నారు. అంతే కాకుండా 4పంచాయతీల్లోని కాలనీల్లో అప్పుడప్పుడు తాగునీటి సమస్య ఏర్పడుతోందని.. దీనిని కూడా పరిష్కరించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ టిబి డ్యాం కింద కేటాయించిన నీటిలో నష్టాలు పోగా, మిగిలిన 10.32 టిఎంసిల నీటిలో మొత్తం 6.3 టిఎంసిల నీటిని త్రాగునీటి సరఫరాకు కేటాయించాలని, మరో 4.02 టిఎంసిలను ఆయకట్టు సాగునీటి అవసరాలకు కేటాయించాలని ప్రపోజల్ పెట్టడం జరిగిందన్నారు.
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉందని, వచ్చే జూన్-జూలై వరకు సరైన వర్షాలు పడే అవకాశం కనిపించడం లేదన్నారు. రాబోయే వర్షాకాలం వచ్చే వరకు ఇవే కరువు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున, తాగునీటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. కాబట్టి తాగునీటి కేటాయింపులను సాధ్యమైతే మరికొంత పెంచడం వల్ల భవిష్యత్తు నీటి ఎద్దడిని మెరుగ్గా ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నారు. సాధారణంగా స్థానిక నీటి అవసరాలు వర్షపు నీటితో భర్తీ అవుతుంటాయి కానీ ఈసారి వర్షపు నీటి భర్తీ లేని పరిస్థితి ఉందన్నారు. గత రెండు నెలలుగా తీవ్రమైన వర్షపాత లోటు నమోదైందని, ఆగస్టు నెలలో: సాధారణం కంటే మైనస్ 70 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని, జులై నెలలో సాధారణం కంటే మైనస్ 55 శాతం తక్కువ వర్షపాతం నమోదైందన్నారు.జిల్లాలోని 12 మండలాల్లో నీటి కొరత తీవ్రంగా ఉందని, దాదాపు 56,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన తోటలు సాగులో ఉన్నాయని హార్టికల్చర్ డిడి తెలుపగా, ఇందులో ప్రధానంగా 35,000 హెక్టార్లలో చీని, మిగిలిన విస్తీర్ణంలో అరటి తోటలు ఉన్నాయని, ప్రస్తుతం ఈ నెలలో చీని తోటలకు ‘ఎండబెట్టే సీజన్’ కావడంతో నీటి వినియోగం తక్కువగా ఉంటుందని తెలిపారు. అయితే, వచ్చే నెల నుండి నీటి అవసరం పెరుగుతుందని, బోర్లు ఎండిపోతున్నందున ప్రత్యామ్నాయ నీటి వసతులపై దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు..ఈ సందర్భంగా హెచ్.ఎల్.సి ఎస్ఈ, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈలు తమ పరిధిలో హెచ్.ఎల్.సి, హెచ్ఎన్ఎస్ఎస్ కింద కేటాయించిన నీటి కేటాయింపులు, సరఫరా, నిల్వలు, తదితర అంశాలను పూర్తి స్థాయిలో వివరించారు.ఈ సమావేశంలో హెచ్.ఎల్.సి ఎస్ఈ సుధాకర్ రావు, హెచ్.ఎన్.ఎస్.ఎస్ ఎస్ఈ రాజగోపాల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సాలురెడ్డి, హార్టికల్చర్ డిడి ఉమాదేవి, టిబి డ్యాం ఈఈ చంద్రశేఖర్, ఆయా శాఖల ఈఈలు పార్థసారథి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస నాయక్, చెన్నయ్య, ఆయా శాఖల డిఈలు, ఏఈలు పాల్గొన్నారు.