ఎల్కతుర్తి మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

ఎల్కతుర్తి మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ. ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:- భారత మాజీ రాష్ట్రపతి,తత్వవేత్త,ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఎల్కతుర్తి మండల వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని,సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్...