ఎల్కతుర్తి మండలంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ.
ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-
భారత మాజీ రాష్ట్రపతి,తత్వవేత్త,ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను శనివారం ఎల్కతుర్తి మండల వనరుల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి చదువుల సత్యనారాయణ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని,సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలు ఎంతో విలువైనవని పేర్కొన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగానికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
కార్యక్రమానికి జెడ్ పి హెచ్ ఎస్ ఎల్కతుర్తి స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు దుర్గాభవాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మండలంలోని వివిధ పాఠశాలల్లో విశిష్ట సేవలు అందిస్తున్న 9 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి శాలువా,మెమెంటో మరియు ప్రశంసా పత్రాలతో ఘనంగా సన్మానించారు.
సన్మానం పొందిన ఉత్తమ ఉపాధ్యాయులు యెర్ర తిరుపతి,ఎడ్ల చంద్ర ప్రకాశ్ రావు,ముప్పిడి రామ్‌కుమార్ రెడ్డి, అకునూరి పుష్పలత, బొమ్మరబోయిన వెంకటేశ్వర్లు,బొల్లంపెల్లి శోభారాణి,యెనుములపల్లి చంద్రశేఖర్,చాడ మనుజా దేవి,బండి సంధ్యారాణిలను ఈ సందర్భంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో అన్ని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు,వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.