prajavaani.net
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 9:08 am Digital Edition : PRAJA VANI

ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ లో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

ఎస్ఐ నరసింహారావు

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్లో గురువారం ఘనంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ సిబ్బందికి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర సాధన ప్రజల సంక్షేమం కోసం జరిగిన ఉద్యమాన్ని స్మరించుకున్నారు. తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలు స్ఫూర్తిని కాపాడుతూ ప్రజలకు సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్సై నరసింహారావు తో పాటు పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ లు మహిళా కానిస్టేబుళ్లు,పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.