ఎలుక చెట్టు తండాలో ఉచిత కంటి వైద్య శిబిరం
మానవత్వం చాటుకున్న సర్పంచ్ మాలోతు రమేష్ నాయక్
డోర్నకల్ నియోజకవర్గ ప్రతినిధి , సెప్టెంబర్ 16, ప్రజావాణి:
కురవి మండలంలోని ఎలుక చెట్టు తండా గ్రామపంచాయతీలో సర్పంచ్ మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సంక్షేమం కోసం ఉచిత కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు.
ఈ శిబిరంలో గ్రామంలోని పలువురు ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలు ఉన్న వారిని గుర్తించారు. అవసరమైన వారికి మహబూబాబాద్‌లోని సూర్య కంటి దవాఖానాలో కంటి శస్త్రచికిత్సలు చేయించారు.
శస్త్రచికిత్స అనంతరం వారి ఆరోగ్య పరిస్థితిని సర్పంచ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అనంతరం వారికి అవసరమైన జాగ్రత్తలు సూచించి, సురక్షితంగా స్వగ్రామానికి చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉచిత వైద్య సేవలు అందించడం పట్ల సర్పంచ్ రమేష్ నాయక్‌ను గ్రామస్థులు అభినందించారు.