prajavaani.net
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 2:02 pm Digital Edition : PRAJA VANI

ఎర్రగట్టుగుట్టలో భక్తి వెల్లువ.. కిట్స్ కళాశాలలో మహా అన్నదానం!

ఎర్రగట్టుగుట్టలో భక్తి వెల్లువ.. కిట్స్ కళాశాలలో మహా అన్నదానం!

వినాయకుడి సన్నిధిలో ఘనంగా అన్నప్రసాద వితరణ

ఎల్లుగు గితిన్, శ్వేత ఆధ్వర్యంలో భక్తులకు సేవ

హసన్‌పర్తి: ప్రజా ప్రతినిధి, ప్రణయ్ గొర్రె

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్టలోని కిట్స్ కళాశాలలో వినాయకుడి సన్నిధిలో మహా అన్నదాన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎల్లుగు గితిన్, శ్వేత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వినాయకుడిని దర్శించుకునేందుకు తరలివచ్చిన భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.

ఈ సందర్భంగా అయ్యా గారు, వేదాంతం పార్థసారథి చారులు కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాద వితరణలో భాగస్వాములయ్యారు. వినాయకుడిని దర్శించుకున్న అనంతరం భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు.

కళాశాల విద్యార్థులు, సిబ్బంది, భక్తులు సేవా కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందిస్తూ సేవాభావాన్ని చాటిన నిర్వాహకులను పలువురు అభినందించారు.

హసన్‌పర్తి మండలం ఎర్రగట్టుగుట్ట కిట్స్ కళాశాలలో వినాయకుడి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదం వడ్డిస్తున్న నిర్వాహకులు, పాల్గొన్న ప్రముఖులు.