ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌కు ఆనంద్‌రావు ఘన స్వాగతం

ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌కు ఘన స్వాగతం కూకట్పల్లి (ప్రజావాణి) సెప్టెంబర్ 15 వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని కూకట్‌పల్లిలోని దేవి ఇస్తానా హోమ్ విల్లాస్‌లో ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. కార్యక్రమంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం మాజీ చైర్మన్, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు మొలుగు ఆనంద్‌రావు, గొట్టుముక్కల రాజు తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా భక్తులు, స్థానిక నాయకులు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేశారు.