prajavaani.net
Newspaper Banner
Date of Publish : 08 September 2026, 11:45 am Digital Edition : PRAJA VANI

ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే క్షమాపణ చెప్పాలి : కాకా రమేష్

ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే క్షమాపణ చెప్పాలి : కాకా రమేష్

దమ్మపేట, ప్రజావాణి న్యూస్, సెప్టెంబర్ 07:
దళితులపై మరియు రాజ్యాంగబద్ధమైన స్థానాల్లో ఉన్న నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బిఆర్ఎస్ నాయకుడు ఎమ్మెల్సీ తాతా మధు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలనీ  దమ్మపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కాక రమేష్ డిమాండ్ చేశారు.మొన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని,నేడు తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ ని బండ బూతులతో అవమానించడం హేయమైన చర్య, ఇలాంటి భాష మాట్లాడిన నాయకుల మాటలను తీవ్రంగా ఖండిస్తూ, వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే ఆ పదవి నుండి వెంటనే తొలగించాలని కాక రమేష్ డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు స్పష్టంగా దళిత వ్యతిరేక అహంకారానికి నిదర్శనమన్నారు. డా. బి.ఆర్. అంబేడ్కర్ ఆశయాలను, రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందనీ కాక రమేష్ గుర్తు చేశారు.దళితుల, గిరిజనుల ఆత్మగౌరవాన్ని అవమానిస్తే యూత్ కాంగ్రెస్ తరుపున సహించేది లేదు అని యూత్ కాంగ్రెస్ దమ్మపేట మండల అధ్యక్షులు కాక రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.