ఎమ్మెల్యే ధర్నా రాజకీయ నాటకం: బీజేపీ

ఎమ్మెల్యే ధర్నా రాజకీయ నాటకం: బీజేపీ ఓటర్ల తొలగింపుపై గ్రామాల వారీగా ఆధారాలు బయటపెట్టాలి ప్రజావాణి జిల్లా ప్రతినిధి పెద్దపల్లి, సెప్టెంబర్ 29 పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు చేపట్టిన ధర్నా, దిష్టిబొమ్మ దహనం కార్యక్రమం ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న రాజకీయ నాటకమని బీజేపీ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీల అమలులో జరుగుతున్న జాప్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సీఎం దిష్టిబొమ్మ దహనం...