ఎఫ్ఎల్ఎన్ సమావేశంలో విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి
*ఎఫ్ఎల్ఎన్ సమావేశంలో విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి* చిలిపిచెడ్. సెప్టెంబర్ 23 ప్రజావాణి మండల విద్యాధికారి పి. విఠల్ ఆధ్వర్యంలో చిలిపి చెడ్ మండలంలోని పాఠశాల సముదాయ స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ (పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం, చదవడం-రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపరచడంపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. మండల విద్యాధికారి పి. విఠల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని...