prajavaani.net
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 12:00 pm Digital Edition : PRAJA VANI

ఎఫ్ఎల్ఎన్ సమావేశంలో విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి

*ఎఫ్ఎల్ఎన్ సమావేశంలో విద్యార్థుల అభ్యసన ఫలితాలపై ప్రత్యేక దృష్టి*

చిలిపిచెడ్. సెప్టెంబర్ 23 ప్రజావాణి

మండల విద్యాధికారి పి. విఠల్ ఆధ్వర్యంలో చిలిపి చెడ్ మండలంలోని పాఠశాల సముదాయ స్థాయిలో ఎఫ్ఎల్ఎన్ (పునాది అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానం) సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థుల్లో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం, చదవడం-రాయడం, గణిత నైపుణ్యాలను మెరుగుపరచడంపై ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.

మండల విద్యాధికారి పి. విఠల్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. విద్యార్థుల స్థాయిని గుర్తించి, అవసరమైన వారికి నిరంతర ప్రత్యేక మద్దతు బోధన, ప్రత్యేక సాధన మరియు వ్యక్తిగత శ్రద్ధ అందించాలని తెలిపారు.

చదవడం, రాయడం, గణిత ప్రాథమిక నైపుణ్యాల్లో నిరంతర అభ్యాసం కల్పిస్తూ, విద్యార్థుల పురోగతిని క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. ప్రతి విద్యార్థిలో అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించి, మెరుగైన ఎఫ్ఎల్ఎన్ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేయాలని మండల విద్యాధికారి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డి రమేష్, ధనమూర్తి ఉపాధ్యాయులు పాల్గొన్నారు