ఎన్ జి కళాశాల ఇద్దరు అధ్యాపకులకు రాష్ట్ర స్థాయి ‘ఉత్తమ అధ్యాపక అవార్డులు’

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నాగార్జున ప్రభుత్వ కళాశాలకు మరో అరుదైన ఘనత దక్కింది. విద్యారంగంలో అంకితభావంతో సేవలు అందిస్తున్న ఆర్ధికశాస్త్ర అధ్యాపకులు డా. డి. మునిస్వామి మరియు సూక్ష్మ జీవ శాస్త్ర అధ్యాపకులు బత్తిని నాగరాజు లకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 'ఉత్తమ అధ్యాపకులు' పురస్కారానికి ఎంపికయ్యారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ పురస్కారాలను అందించారు. ఈ సందర్బంగా వారిద్దరినీ కళాశాల స్టాఫ్ క్లబ్ తరపున ఘనంగా సన్మానించారు. విద్యార్థుల సంక్షేమం, విద్యాబోధనలో నూతన...