prajavaani.net
Newspaper Banner
Date of Publish : 19 September 2026, 5:07 pm Digital Edition : PRAJA VANI

ఎన్జీ కళాశాలలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్స్ మరియు కాంపిటీషన్స్

ఎన్జీ కళాశాలలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో హెరిటేజ్ వాక్స్ మరియు కాంపిటీషన్స్

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాల అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన చారిత్రక, పర్యాటక రంగంపై యువకులలో, ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి కళాశాల స్థాయిలో వివిధ రకాల పోటీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా చారిత్రక, పర్యాటక, సాంస్కృతిక రంగాన్ని ప్రోత్సహిస్తూ 2047 నాటికి వికసిత్ భారత్, రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చెందాలని ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి, హెరిటేజ్ వాక్స్, పాటల పోటీలు, డాన్స్, ఆర్ట్ మరియు క్రాఫ్ట్స్ , రీల్స్, షార్ట్ ఫిల్మ్ విభాగాలలో పోటీలు నిర్వహించడం జరిగినది. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఉపేందర్ మాట్లాడుతూ పర్యాటక రంగాన్ని దేశ అభివృద్ధిలో భాగం చేయడానికి తమ కళాశాల విద్యార్థులు, కోఆర్డినేటర్ మరియు సభ్యులు తమ వంతు కృషి చేయాలని అన్నారు . కళాశాలలో ప్రతిభ చూపించిన విద్యార్థులను జిల్లా స్థాయికి పోటీలకు ఎంపిక చేయడం జరుగుతుందని అన్నారు. శనివారం ఛాయా సోమేశ్వరాలయం ముందు, క్లాక్ టవర్, చర్చి, లతీఫ్ సాహెబ్ గుట్ట దగ్గర హెరిటేజ్ వాక్ చెయ్యడం జరిగినది.ఈ లో బుధవారం కార్యక్రమంలో నల్గొండ టూరిజం ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ అలీ పాల్గొనడంతోపాటు వారు మాట్లాడుతూ నల్గొండ జిల్లా మొత్తం మీద సుమారుగా 40 పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని ఇంకా గుర్తించవలసినటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయని అన్నారు. టూరిజం పట్ల ఎన్జీ కళాశాల విద్యార్థులు చూపిస్తున్న ఆసక్తిని అభినందించారు. జరిగిన కార్యక్రమంలో యువ టూరిజం క్లబ్ కోఆర్డినేటర్ నర్సింగ్ కోటయ్య, బాటనీ లెక్చరర్ కృష్ణ, చరిత్ర ఉపన్యాసకులు డాక్టర్ ఎస్ కే హబీబ్, కె శివరాణి, శిరీష యువ టూరిజం క్లబ్ సభ్యులు మరియు విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు