ఎన్‌ఎస్‌ఎస్‌ సేవా కార్యక్రమాల్లో విద్యార్థులు చురుకుగా పాల్గొనాలి

సామాజిక బాధ్యతతో విద్యార్థులు ముందుకు సాగాలని పిలుపు బెజ్జంకి, సెప్టెంబర్ 24 (ప్రజావాణి) సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ఎన్‌ఎస్‌ఎస్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని 57వ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్‌) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సామాజిక సేవ,బాధ్యతలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సమాజ సేవను తమ బాధ్యతగా భావించి సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు.ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సేవాభావం, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని,గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం,...